Bhadrachalam: భద్రాచలంలో అమానవీయ ఘటన.. ఆడపిల్ల అనే కారణంతో అప్పుడే పుట్టిన బిడ్డను..

|

Sep 14, 2021 | 9:01 AM

Bhadrachalam: మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది.

Bhadrachalam: భద్రాచలంలో అమానవీయ ఘటన.. ఆడపిల్ల అనే కారణంతో అప్పుడే పుట్టిన బిడ్డను..
New Born
Follow us on

Bhadrachalam: మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అదికూడా రామయ్య కొలువుదీరిన భద్రాచంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అబంశుభం తెలియని పసిగుడ్డును ఆడపిల్ల అనే ఒక్క కారణంతో చెత్తకుప్పల్లో పడేసి వెళ్లారు మానవత్వం లేని దుర్మార్గులు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. భద్రాచలం పట్టణంలోని బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్త కుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండటంతో స్థానికులు గమనించారు.

వెంటనే చిన్నారిని చేరదీసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడపిల్ల కావడంతోనే వదిలి వెళ్లినట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, చిన్నచిన్న గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాపను చెత్తకుప్పలో ఎవరు వదిలి వెళ్లారు? ఎందుకు వదిలిపెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Also read:

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో మొదటి ఎలిమినేషన్‏లో సరయును అందుకే తప్పించారా ? వారానికే అంత పారితోషికమా ?

Tollywood: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాల లిస్టు ఇదే.. ఓ లుక్కేయండి.!

SBI Alert: ఆధార్​తో పాన్​ లింక్​ చేశారా.. లేకంటే రూ. 10000 ఫైన్.. హెచ్చరించిన ఎస్‌బీఐ