Telangana Weather Update: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉదయం నుంచి హైదరాబాద్‌లో కుండపోత..
ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరికొన్ని గంటలపాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ తెలిపింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు, డీఆర్‌ఎఫ్ టీమ్స్‌ను సిద్ధం చేశారు.
జులై 22న..
తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడొచ్చని వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 23న..
తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడొచ్చని వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆషిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 24న..
తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడొచ్చని వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆషిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 25న..
తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడొచ్చని వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యా్ల్, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్ధిపేట జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 26న..
తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడొచ్చని వాతావరణ కేంద్ర తెలిపింది. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.