
హైదరాబాద్, ఆగస్ట్ 28: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. వాయువ్య దిశలో కదిలి ఒరిస్సా తీరానికి చేరే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆకస్మిక వరద ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం (ఆగస్ట్ 28) ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
శుక్రవారం (ఆగస్ట్ 29) ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈరోజు, రేపు కూడా తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అన్ని జిల్లాలలో ఈ రెండు రోజులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా.. 43.3 సెం.మీ, కామారెడ్డి లో.. 29.5 సెం.మీ, తడ్వాల్ లో.. 28 సెం.మీ, భిక్నూర్ లో.. 27.9 సెం.మీ, లింగంపేటలో.. 22.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా రూరల్ లో.. 32.3 సెం.మీ, లక్ష్మణ చందా లో.. 27.9 సెం.మీ, నిర్మల్లో.. 24.1 వర్షపాతం నమోదయింది. ఇక హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం 6 గంటల వరకు దాదాపు అన్ని చోట్ల వర్షం దంచికొట్టింది. కూకట్ పల్లిలో.. 4.2, శేరిలింగంపల్లి లో.. 3.4, కుత్బుల్లాపూర్ లో.. 3.2, రామచంద్రపురం లో.. 3.1, ఖైరతాబాద్‌లో.. 2.9, బాలానగర్‌లో.. 2.7, గచ్చిబౌలిలో.. 2.6, అల్లాపూర్‌లో.. 2.5, యూసఫ్ గూడలో.. 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.