
హైదరాబాద్, జనవరి 28: గత వారం నుంచి నగరంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నగరవాసుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో హైదరాబాద్ వాసులు మరోసారి చలికాలం చలిని చవిచూడాల్సి వస్తోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) నివేదిక ప్రకారం, నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కు పడిపోయాయి. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోవడంతో శీతాకాలపు చలిని తిరిగి చూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో
2024 జనవరి 30, వరకు హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 20 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందని TSDPS అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీని కారణంగా హైదరాబాద్‌లో పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని అంచనావేస్తోంది వాతావరణ శాఖ. శీతాకాలపు చలి రాబోయే రెండు రోజుల పాటు తిరిగి నగరంలో ఉండోచ్చని భావిస్తోంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణాన్ని చూసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అయితే, పొగమంచు హెచ్చరికలు జారీ చేయబడలేదు మరియు వాతావరణ శాఖ సాధారణంగా మేఘావృతమైన ఆకాశం గురించి అంచనా వేసింది.
మారేడ్పల్లి రాత్రి పూట 15.2 డిగ్రీల సెల్సియస్ కాగా పగటిపూట 28.2 గా నమోదవుతోంది. అలాగే తిరుమల గిరి, శేరిలింగంపల్లి, గోల్కొండ ప్రాంతంలో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రత 16.5 నుంచి 16.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతోంది. అదే గరిష్ఠ ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదవుతోంది. బహుదూర్‌పుర చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిష్ఠంగా 17.9 కాగా గరిష్ఠంగా 29 డిగ్రీలు నమోదవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..