AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు

ఆ ఆంబోతుకు తీవ్ర అనారోగ్యం చేసింది. మరి అది ఆస్పత్రి అని దానికి తెలుసో లేదా యథాలాపంగా వెళ్లిపోయిందో తెలియదు కానీ ఏకంగా.. 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఏదో అది వచ్చింది పడుకుంది అనుకున్నా రు కానీ.. దానికి బాలేదని రెండు రోజులు వరకు ఎవరూ గుర్తించారు. ఆ తర్వాత....

Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు
Bull
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 31, 2025 | 6:52 PM

Share

సాధారణంగా మనుషులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్‌‌కు వెళ్తారు. అక్కడ డాక్టర్లు సూచించినదాని ప్రకారం.. టెస్టులు చేయించుకుని మాత్రలు తీసుకుని వస్తారు. ఒకవేళ వెళ్లడం చేతగాకపోతే కుటుంబ సభ్యుల్ని ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడలేని.. ఒక మూగ జీవి అనారోగ్యం పాలైంది నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ ఆంబోతు..ఆసుపత్రికి నడిచి వెళ్లింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామస్థులు రెండు ఆంబోతులను పెంచుతున్నారు.. వాటి సంరక్షణ గ్రామస్థులు చూస్తున్నారు.. వాటిలో ఒక 14 ఏళ్ల ఆంబోతు అనారోగ్యం పాలై ఏకంగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చింది. రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే  నడవలేని స్థితిలో ఉంది. అక్కడే ఉన్న 108 సిబ్బంది గమనించి ప్రభుత్వ వెటర్నరీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్య సిబ్బంది ఆంబోతుకు మెరుగైన వైద్యం అందించి దాని ప్రాణాలు కాపాడారు.

మూగజీవైన ఆంబోతుకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన వెటర్నరీ వైద్య సిబ్బంది, 108 సిబ్బందికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి వైద్య సేవలు అందుకున్న ఆంబోతును చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నోరు లేని మూగజీవైన ఆంబోతు సర్కారు దవాఖానకు వైద్యం కోసం వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి 

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?