నాయకుల మాటలు విని తప్పు చేస్తే అధికారులు జైలుకు వెళ్తారుః సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు, నిప్పును రాజేస్తున్నాయి. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య ప్రాజెక్టు లడాయి మొదలైంది. కొలువుల కేంద్రంగా పొలిటికల్‌ కొట్లాట పీక్స్‌కు చేరుకుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌ను భ్రష్టుపట్టించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ పాలనలో ఎన్ని నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్‌ చేశారు.

నాయకుల మాటలు విని తప్పు చేస్తే అధికారులు జైలుకు వెళ్తారుః సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy

Updated on: May 15, 2025 | 8:09 AM

తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు, నిప్పును రాజేస్తున్నాయి. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య ప్రాజెక్టు లడాయి మొదలైంది. కొలువుల కేంద్రంగా పొలిటికల్‌ కొట్లాట పీక్స్‌కు చేరుకుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌ను భ్రష్టుపట్టించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ పాలనలో ఎన్ని నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ జలసౌధలో నిర్వహించిన కొలువు పండుగ వేదికగా బీఆర్‌ఎస్‌పై వాగ్బాణాలను సంధించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇరిగేషన్‌ శాఖలో కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్. పదేళ్లు అధికారంలో వున్న బీఆర్‌ఎస్‌ ఇరిగేషన్‌ శాఖలో కనీస స్థాయిలో కూడా నియమకాలు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగులు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. గ్రూప్‌ 1 నియామకాలను అడ్డుకున్న కుట్రదారులెవరో ప్రజలకు తెలుసన్నారు సీఎం. బీఆర్‌ఎస్‌ హయాంలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 50వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయిందన్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా సరే బీఆర్‌ఎస్‌..తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఏరులై పారిన నిధులు ఎవరి జేబుల్లోకి పోయాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గత పాలకుల కనుసన్నల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు ఊచలు లెక్క పెట్టక తప్పదని ముఖ్యమంత్రి అన్నారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. నియామక పత్రాలు ఇచ్చి సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అధికారులను ఉరితీయాలని విజిలెన్స్ నివేదికలు చెబుతాయా.. ఇది ప్రజాస్వామ్యమా.. రేవంత్‌ రాచరిక రాజ్యమా?అని హరీష్‌ రావు ఘాటుగా ట్వీట్‌ చేశారు. కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి SLBC టన్నెల్‌ పనులపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

నీళ్లు- నియమాకాలపై లొల్లి మరో టర్న్‌ తీసుకుంది. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీష్‌రావు కామెంట్‌పై స్పందించారు సీఎం రేవంత్‌ రెడ్డి. బిల్లా అయినా.. రంగా అయినా ఒక్కటే కదా అని చిట్‌చాట్‌లో సెటైర్‌ వేశారు.. కొప్పుల ఈశ్వర్, రసమయి నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌ చెబితే బాగుండేదన్నారు సీఎం రేవంత్. దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చేయలేదు. కేసీఆర్‌ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. కనీసం ఇప్పుడైనా దళితుడికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ సలహా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..