Telangana: హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు.. ఈ కార్డు చేతుల్లో ఉండాల్సిందే
భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేసిన హైవే అథారిటీ.. హైవేల నిర్వహణలో కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఈ కొత్త నిబంధనలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేసేందుకు హైవే అథారిటీ సన్నాహాలు చేస్తోంది.

దేశంలోని హైవేల నిర్వహణ విషయంలో వాహనదారుల భద్రతను కట్టుదిట్టం చేయడం, పారదర్శకతను పెంచడం, టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. నేషనల్ హైవేల నిర్వహణలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువస్తోంది. ఇకపై హైవేలపై ప్రయాణం అంటే కేవలం వాహనం నడపడమే కాదు.. ప్రభుత్వ నిబంధనలను పక్కాగా పాటించేందుకు హైవే అథారిటీ.. నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. మరోవైపు దీర్ఘకాలంలో భారత హైవేలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి, ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైనది ఐడి కార్డు రూల్స్. వాహన దొంగతనాలు, స్మగ్లింగ్, అనధికారిక రవాణాను అరికట్టేందుకు కొత్త ఐడి రూల్స్‌ను అమలు చేయనుంది. హైవేలపై ప్రయాణించే వాహనదారులు ఇక నుంచి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు లేకపోతే ఫైన్ విధించడంతో పాటు ప్రయాణాన్ని నిలిపి వేయనున్నారు. కొత్త నిబంధనలతో మరోవైపు నేషనల్ హైవేలపై ఇక నుంచి పెట్రోలింగ్ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. వీటితో పాటు వెహికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరింత కఠినతరం కానుంది. వాహనాల ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ వివరాలను హైవే పెట్రోలింగ్ టీమ్స్ ఎక్కడైనా తనిఖీ చేయనున్నాయి. ముఖ్యంగా హైవేలపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, ఫిట్‌నెస్ లేని వాహనాలను అరికట్టేందుకు హైవే అథారిటీ.. ఈ చర్యలను చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆధునిక సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలు ప్రతి వాహనం కదలికను గమనించనున్నాయి.
నేషనల్ హైవేల నిర్వహణలో పారదర్శకత, భద్రత కోసం టోల్ ప్లాజాల వద్ద నిఘా పెరగనుంది. ఇందుకోసం టోల్ ప్లాజాలు, హైవే జంక్షన్ల వద్ధ అత్యాధునిక సర్వేలెన్స్ కెమెరాలతో ట్రాఫిక్ మానిటరింగ్ హైవే అధికారులు చేయనున్నారు. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ విషయంలో కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించేందుకు హైవే అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు.. వాహన దారులకు మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా.. ఆ తర్వాత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి నేషనల్ హైవేలపై ప్రయాణానికి ముందే అవసరమైన ఐడి కార్డ్స్, పూర్తి డాక్యుమెంట్లతో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..
