
స్మితా సబర్వాల్.. ఈమెను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చురుకైన IAS ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె TS ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్ సాధించారు. ఆమె దేశంలోని టాప్ ఐఏఎస్ మహిళా అధికారుల్లో ఒకరు. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్ స్టాలో దాదాపు ఐదున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలో.. ఆమె కేంద్ర సర్వీసులకు వెళతారన్న రూమర్స్ వచ్చాయి. నిజంగానే ఆమె సెంట్రల్ కేడర్‌కి మారిపోతారా..? ఫ్యూచర్‌లో పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశం ఉందా వంటి అంశాలకు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర సర్వీసులకు తాను అప్లయ్ చేయలేదని వివరించారు. తన గురించి కొన్ని విషయాలు యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంటున్నట్లు చమత్కరించారు. ఫ్యూచర్‌లో రాజకీయాల్లో వస్తారా అని ప్రశ్నకు.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడెలా చెప్పగలమన్నారు. తనపై వచ్చే విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వనని, నిబద్దతతో పని చేసుకుంటూ వెళ్లానని స్మితా సబర్వాల్ వివరించారు. ఇక లేటెస్ట్‌గా తాను గుంటూరు కారం సినిమా చూసినట్లు చెప్పారు. ఒత్తిడి పరిస్థితులు ఎదురైనప్పుడు.. తన ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి వెళ్లి సేద తీరతానని చెప్పారు. మెదక్ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. చిన్పప్పుడు బ్యాడ్మింటన్, మ్యూజిక్, స్విమ్మింగ్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ.. మంచి పనులు చేస్తే ప్రజల ఆదరణ ఉంటుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.