హైడ్రా వచ్చేస్తోంది జాగ్రత్త..! చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంతటి వారైనా వదలడంలేదు. చెరువుల, నాళాలు, కుంటలు వంటి వాటిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారి భరతం పడుతోంది. తాజాగా బౌరంపేట, బోరబండ, మాదాపూర్ తోపాటు పలు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ కూల్చివేత పనులు చేపట్టింది. ముఖ్యంగా అయ్యప్ప సోసైటీలోని బోరబండ సున్నం చెరువును కబ్జా చేసి అక్కడ రెసిడెన్సీలు వ్యాపార సముదాయాలు షర్ట్స్ వేసుకుని కొంతమంది జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే చెరువు కబ్జాకు గురైందంటూ కొంతమంది స్థానికులు హైడ్రాను సంప్రదించారు. ఆ తర్వాత బోరబండ సున్నం చెరువును పరిశీలించిన హైడ్రో కమిషనర్ రంగనాథ్ అక్కడ అక్రమించుకున్న వారికి నోటీసులను జారీ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం తిరిగి సమాధానం కూడా ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగింది హైడ్రా. అక్రమ నిర్మాణాలను, భవనాలను కూల్చివేసింది హైడ్రా.
అయితే బోరబండ సున్నం చెరువు గతంలో మంచినీటి చెరువుగా ఉండేది. దాని పూర్తిస్థాయి విస్తీర్ణం 26 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 కుంటలుగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 5 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే సుమారు 10 ఎకరాలకు పైగా ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టారు. దీంతో ఆదివారం(సెప్టెంబర్ 8) తెల్లవారుజాము నుంచి హైట్రా రంగంలోకి దిగి. అక్రమ కట్టడాలను కూల్చివేసింది. మరోవైపు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భవనాలను కూల్చివేయడం సరికాదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విధంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో హైడ్రా ఝులు విదిలిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..