ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరకు యువకుడు ఆత్మహత్య.. అసలేం జరిగిదంటే..?

Hyderabad: ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం నడుపుతున్న యువకుడి గురించి తన ప్రియురాళ్లకు తెలిసిపోవడంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో శివప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు ఉరి వేసుకుని..

ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరకు యువకుడు ఆత్మహత్య.. అసలేం జరిగిదంటే..?
Representative-Image of Shivakumar Incident

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 23, 2023 | 9:35 AM

హైదరాబాద్ న్యూస్, జూలై 23: ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం నడుపుతున్న యువకుడి గురించి తన ప్రియురాళ్లకు తెలిసిపోవడంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో శివప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్‌కు చెందిన శివప్రసాద్(23) ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్ బస్తీలో అద్దెకు ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఓ యువతితో శివప్రసాద్ సహజీవనం చేస్తున్నాడు. అంతా సజావుగా ఉందనుకుంటుండగానే తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో ఓ నర్సు వెనుక ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న శివప్రసాద్.. ఆమెను నమ్మించేందుకు ఛాతిపై ఆమె ఫొటో, పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీంతో సదరు నర్స్ శివప్రసాద్‌ని ప్రేమించేందుకు అంగీకరించింది.

అయితే మూడురోజుల క్రితం శివప్రసాద్ ఛాతిపై పచ్చ బొట్టును గమనించిన తొలి ప్రేయసి ఆగ్రహంతో అతడిని నిలదీసింది. ఆపై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం శివప్రసాద్ తాను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి రెండో యువతిని పెళ్లి చేసుకుందామని కోరాడు. కానీ అప్పటికే నిద్ర మాత్రలు మింగిన అతడి మొదటి ప్రియురాలు గురించి తెలిసిపోవడంతో రెండో యువతి అతన్ని తిరస్కరించింది. దీంతో శివప్రసాద్ శనివారం తెల్లవారు జామున తన గదిలోని ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి ప్రేయసి కోలుకోవడంతో ఆమెను రెస్క్యూ హోమ్‌కి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..