Daggubati Purandeswari : ఎన్టీయార్ శతజయంత్యుత్సవాలు నభూతో నభవిష్యత్ స్థాయిలో నిర్వహించబోతున్నామని ఆయన కూతురు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఎన్టీయార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆమె మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో తన తమ్ముడు బాలక్రిష్ణతో పాటు రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్ లాంటి సినీప్రముఖులు పాల్గొంటారన్నారు. జాస్తి చలమేశ్వరరావు సహా అనేక మంది ప్రముఖుల సలహాలు-సూచనల మేరకు ఈ ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12 ప్రధాన నగరాల్లో ఉత్సవాలు జరుగుతాయని, హైదరాబాద్- విజయవాడల్లో మెగా ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. త్వరలో ఎన్టీయార్ బొమ్మతో వంద రూపాయల నాణెం మీద రాబోతోందని, ఈ విషయమై ఆర్బీఐతో మాట్లాడుతున్నామని పురందేశ్వరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని.. వారి సూచనలతో అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నామని పురందేశ్వరి తెలిపారు.
కాగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు చేరుకుని.. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..