Hyderabad: ఇదేంటిది ఇలా తయారయ్యారు.. గరిటెను ఎర్రగా కాల్చి భర్తకు వాతపెట్టిన భార్య…

|

Feb 10, 2024 | 11:03 AM

 కొందరు క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటుంటారు.. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ.. విచక్షిణారహితంగా ప్రవర్తిస్తుంటారు.. ఇలాంటి ఘటనలు ఎవరి మధ్యనో జరిగితే పర్లేదు.. కానీ.. భార్యాభర్తల మధ్య జరిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరూ జీవితాంతం కలిసి మెలసి ఉండాల్సిన వారే.. ఈ విధంగా గొడవలు పడుతూ..

Hyderabad: ఇదేంటిది ఇలా తయారయ్యారు.. గరిటెను ఎర్రగా కాల్చి భర్తకు వాతపెట్టిన భార్య...
Crime News
Follow us on

హైదరాబాద్, ఫిబ్రవరి 10: కొందరు క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటుంటారు.. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ.. విచక్షిణారహితంగా ప్రవర్తిస్తుంటారు.. ఇలాంటి ఘటనలు ఎవరి మధ్యనో జరిగితే పర్లేదు.. కానీ.. భార్యాభర్తల మధ్య జరిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరూ జీవితాంతం కలిసి మెలసి ఉండాల్సిన వారే.. ఈ విధంగా గొడవలు పడుతూ.. చివరకు బంధాన్ని తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగించింది.. ఓ భార్య.. తన భర్త మాట వినడం లేదంటూ గరిటె కాల్చి వాతపెట్టింది.. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 13లోని అంబేడ్కర్‌నగర్‌లో గుండప్ప అనే వ్యక్తి.. తన భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా నివసిస్తున్నాడు.. వారు ఉండే ఇంటికి సమీపంలోనే అతడి ఇద్దరు బామ్మర్దులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. గుండప్ప, లక్ష్మి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. దీంతో ఏడాది కాలంగా వీరి మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో భార్య లక్ష్మి, బామ్మర్దులు కలిసి గుండప్పను ఇల్లు వదిలి వెళ్లాలంటూ నిత్యం వేధిస్తున్నారు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి 7 గంటల ప్రాంతంలో బామ్మర్దులైన గోవింద్, బాలాజీ గుండప్పతో గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా.. ఇద్దరు బామ్మర్థులు అతనిపై దాడిచేశారు. కర్రతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. ఇదే సమయంలో.. భార్య లక్ష్మి కూడా వారితో జతకట్టింది. గొడవ జరుగుతున్న సమయంలో.. గరిటెను ఎర్రగా కాల్చి గుండప్ప చెంప మీద వాతపెట్టింది.

భార్య సహా.. ఇద్దరు బామ్మర్దులు దాడి చేయడంతో గాయాలపాలు అయిన గుండప్ప గురువారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..