Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూరు ప్రాజెక్టు ఫేజ్–3 మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ పనులతో పాటు టీఎస్ ట్రాన్స్‌కో సాధారణ నిర్వహణ పనులు కూడా జరగనున్నాయి. రాత్రి 8 గంటల వరకు పనులు కొనసాగనున్న నేపథ్యంలో 12 గంటల పాటు నీటి సరఫరా నిలిచే అవకాశం ఉంది.

Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు నీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply

Edited By:

Updated on: Jan 17, 2026 | 11:02 AM

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్–3 మెయిన్ పైప్‌లైన్‌లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అదేవిధంగా, టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు కూడా నిర్వహించనున్నారు. ఈ పనులు జనవరి 17, శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.

నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.

డివిజన్–9: కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.

డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.

డివిజన్–17: గోపాల్ నగర్.

డివిజన్–22: తెల్లాపూర్.

ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.