International Sweet Festival: స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్.. సంక్రాంతి రోజున ప్రత్యేక ఆహ్వానం..

|

Jan 13, 2025 | 6:11 PM

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ కైట్‌ ఫెస్టివల్‌లో 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్‌ క్లబ్‌ సభ్యులు హాజరవుతున్నారు. కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను తిలకించేందుకు 15 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

International Sweet Festival: స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్.. సంక్రాంతి రోజున ప్రత్యేక ఆహ్వానం..
International Sweet Festiva
Follow us on

హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ మూడు రోజుల పాటు కొనసాగనుంది. సోమవారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బుధవారం వరకు కొనసాగనుంది.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ కైట్‌ ఫెస్టివల్‌లో 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్‌ క్లబ్‌ సభ్యులు హాజరవుతున్నారు. కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను తిలకించేందుకు 15 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌ లో భాగంగా అదిరిపోయే స్వీట్లు, పిండి వంటలను తయారు చేస్తున్నారు. స్వీట్‌ ఫెస్టివల్‌ లో ఉత్తరాఖండ్ కు చెందిన వ్యాపారస్తులు హోమ్‌ మేడ్‌ స్వీట్స్‌తో అదిరిపోయే రుచులను అందిస్తున్నారు.. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ లో భాగం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 13 నుంచి 15 వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్నో రకాల స్వీట్లను అందుబాటులో ఉంచనున్నారు.

వీడియో చూడండి..

దీనిలో భాగంగా సంకాంత్రి రోజున మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఉత్తరాఖండి డ్యాన్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.దీనిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తమ వద్ద ఉత్తరఖండ్ కు చెందిన ఎన్నో రకాల స్వీట్లతో పాటు.. జ్యూసెస్, సూప్, చాయ్.. ఇలా ఎన్నో రుచులను ఆస్వాదించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..