Kishan Reddy: ఆ ప్రాంతాల్లో తిరిగితే హైదరాబాద్‌ అసలు సమస్యలు తెలుస్తాయి.. కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

|

Dec 04, 2022 | 6:45 AM

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునే ఉద్దేశంతో సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన పాద..

Kishan Reddy: ఆ ప్రాంతాల్లో తిరిగితే హైదరాబాద్‌ అసలు సమస్యలు తెలుస్తాయి.. కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
Central Minister Kishan Reddy
Follow us on

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునే ఉద్దేశంతో సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన పాద యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం పాద యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వా్న్ని టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌ నగరం అంటే హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, మాదాపూర్‌ మాత్రమే కాదన్న కిషన్‌ రెడ్డి.. పేద ప్రజలు నివసించే ప్రాంతాలు కూడా హైదరాబాదేనన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, పాతబస్తీలాంటి ప్రాంతాల్లో తిరిగితే అసలు సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు కిషన్‌రెడ్డి.

ఇందులో భాగంగా ఖైరతాబాద్‌ హిమాయత్‌నగర్‌లో గల్లీగల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, నీటి సమస్యను స్థానికులు కిషన్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. బస్తీలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బస్తీల్లో సమస్యలను పరిష్కరించి, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..