Hyderabad: సాఫ్ట్‌వేర్ సంస్థలకు (Software Companies) కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలపాను విస్తరించింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న కాగూల్ డేటా (Kagool Data) సెంటర్ అండ్ ఈఆర్పీ హైదరాబాద్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కపిల్ టవర్స్‌లో ఈ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.
డేటా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కాగూల్ డేటా ఇండియాఆపరేషన్స్ హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి మాట్లాడుతూ.. ‘2017లో కాగూల్ హైదరాబాద్‌లో తొలి బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రెండవ డేటా సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో కాగూల్ సేవలను మరింత విస్తృతం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 200మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా వారిలో 70శాతం స్థానికులే కావడం విశేషం. ఇక 2025 చివరి నాటికి కాగూల్‌లో ఉద్యోగుల సంఖ్య 2000 పెంచడంతో పాటు, రూ. 38 కోట్ల పెట్టుబడి పెట్టనుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక హైదరాబాద్‌కు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతుండడం పట్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘నగరానికి కాగూల్ లాంటి పెద్ద సంస్థలతో పాటు మధ్యస్థ, చిన్న కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయని’ తెలిపారు.
Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడికి షాకిచ్చిన జూడో ఫెడరేషన్.. ఆ పదవి నుంచి సస్పెండ్..