Hyderabad: స్కూల్‌ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్‌.. లొకేషన్‌ ట్రాక్‌ చేయగా..

| Edited By: Narender Vaitla

Nov 22, 2024 | 1:32 PM

హైదరాబాద్ ముసాపేట్‌కు చెందిన ఇద్దరు బాలికల మిస్సింగ్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. స్కూలుకు వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన చిన్నారులు సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఆ చిన్నారులు ఏటు వెళ్లారో తెలుసుకున్న పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముసాపేట్‌కు చెందిన ఇద్దరు బాలికలకు బీచ్ కు వెళ్ళడం అంటే పిచ్చి క్రేజ్..దీంతో ఎలాగైనా సరే బీచ్ కు వెళ్ళాలని ప్లాన్ చేసారు. ఈ క్రమంగానే తల్లితండ్రులు స్కూల్ […]

Hyderabad: స్కూల్‌ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్‌.. లొకేషన్‌ ట్రాక్‌ చేయగా..
Girls Missing
Follow us on

హైదరాబాద్ ముసాపేట్‌కు చెందిన ఇద్దరు బాలికల మిస్సింగ్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. స్కూలుకు వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన చిన్నారులు సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఆ చిన్నారులు ఏటు వెళ్లారో తెలుసుకున్న పోలీసులు షాక్‌కి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ముసాపేట్‌కు చెందిన ఇద్దరు బాలికలకు బీచ్ కు వెళ్ళడం అంటే పిచ్చి క్రేజ్..దీంతో ఎలాగైనా సరే బీచ్ కు వెళ్ళాలని ప్లాన్ చేసారు. ఈ క్రమంగానే తల్లితండ్రులు స్కూల్ లో దించాక, ఏవేవో సాకులు చెప్పి స్కూల్ నుండి మధ్యలోనే బయటకి వచ్చేశారు. పక్కనే ఉన్న ఒక నిర్మాణ భవనంలోకి వెళ్లి స్కూల్ యూనిఫాం తీసి సాధారణ దుస్తులు ధరించారు. అక్కడి నుంచి ఎలాగైనా బీచ్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇద్దరు బాలికల్లో ఒక బాలిక స్వస్థలం గుంటూరు. తరచూ బాపట్ల బీచ్ గురించి తన స్నేహితురాలితో చెబుతూ ఉండటంతో ఎలగైనా సరే బాపట్ల బీచ్ కు వెళ్లాని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు బస్ ఎక్కి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ లోపు స్కూల్ సమయం ముగియడంతో వారిని పిక్ చేసుకునేందుకు వారి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలు స్కూల్‌లో లేరని తెలుసుకున్న తల్లిదండ్రులు కంగారు పడ్డారు.

అటు ఇటు వెతికి పోలీసులకు సమాచారం అందించారు. కూకట్‌పల్లి పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి అన్ని చోట్ల వెతికారు. చివరికి స్కూల్‌కు దగ్గరలో ఉన్న ఒక సీసీ కెమెరాలో ఇద్దరి బాలికలను గుర్తించారు. యూనిఫాం మార్చుకుని సాధారణ దుస్తులు ధరించేందుకు నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్ళారు. లోపలికి యూనిఫాం లో వెళ్లిన బాలికలు బయటకి సాధారణ దుస్తులు ధరించి ఉండటం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

అక్కడి నుంచి బాలికలు వెళ్లిన రూట్‌లో ఉన్న ఆన్న సీసీ కెమెరాల ఫాలో అవుతూ వచ్చారు. ఇంతలో బాలికలకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను చెక్‌ చేయగా గుంటూరు వెళ్తున్నట్లు లొకేషన్‌ ట్రేస్‌ చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఒక ఎస్ ఐ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలికలను సురక్షితంగా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..