TV9 Health Camp: ఉద్యోగుల కోసం టీవీ9 ఫ్రీ హెల్త్‌ క్యాంప్‌.. 300 మందికిపైగా వైద్య పరీక్షలు..

|

Dec 23, 2022 | 9:05 PM

టీవీ9  యాజమాన్యం ఉద్యోగుల కోసం శుక్రవారం హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ ఆఫీసులో ఈ హెల్త్‌ క్యాంప్‌ను ఉచితంగా ఏర్పాటు చేసింది. హెల్త్‌ క్యాంప్‌ను..

TV9 Health Camp: ఉద్యోగుల కోసం టీవీ9 ఫ్రీ హెల్త్‌ క్యాంప్‌.. 300 మందికిపైగా వైద్య పరీక్షలు..
Follow us on

టీవీ9  యాజమాన్యం ఉద్యోగుల కోసం శుక్రవారం హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ ఆఫీసులో ఈ హెల్త్‌ క్యాంప్‌ను ఉచితంగా ఏర్పాటు చేశారు. హెల్త్‌ క్యాంప్‌ను మెడికవర్ హాస్పిటల్, స్మార్ట్ విజన్, అపోలో డెంటల్‌ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు పలు రకాల పరీక్షలను నిర్వహించారు.

సుమారు 300 మంది ఉద్యోగులు.. ఈ ఉచిత హెల్త్‌ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకున్నారు. బీపీ, షుగర్, కంటి, దంత, గైనకాలజీ పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో వంటి గుండె సంబంధిత పరీక్షలు సైతం నిర్వహించారు. టెస్టులు నిర్వహించిన సిబ్బంది.. అవసరమైన వారికి సలహాలు, సూచనలు చేశారు. ఫిట్‌నెస్‌కి, డైట్‌కి సంబంధించి కూడా పలు టిప్స్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

 

ఈ క్యాంప్‌లో మెడికోవర్ హాస్పిటల్స్ నుంచి కార్డియాలజిస్ట్ సాకేత్, పుల్మోనాలజిస్ట్ అపూర్వ్, గైనకాలజిస్ట్ శృతి, జనరల్ ఫిజిషియన్ డా.మోయిన్… స్మార్ట్‌విజన్ హాస్పిటల్ నుంచి డా.దేవి ప్రసాద్, నరేష్, అపోలో డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నీలిమ, డాక్టర్ అఖిల్, స్వరాజ్ తదితరులు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు.

 

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..