ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. జూలై 3వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా ఈ టూర్ ప్యాకేజీని అందిస్తున్నారు. తమిళనాడులోని అరుణాచల గిరికి ఈ టూర్ ప్యాకేజీని అందిస్తున్నారు. జులై 2వ తేదీన ప్రారంభం కానున్న ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
జులై 2వ తేదీన ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి సర్వీసు నెంబర్ 98889 బస్సు బయలుదేరుతుంది. అనంతరం ఏపీలోని కాణిపాకంలో వినాయకుడి దర్శనం అనంతరం అదే రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అనంతరం అరుణాచల గిరి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత జులై 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటారు. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. జులై 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్ రావడంతో టూర్ ముగుస్తుంది. టూర్ ప్యాకేజీ విషయానికొస్తే.. ఒక్కొక్కరికి రూ. 2600గా ఉంది.
సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ప్రయాణికులు ముందస్తుగా ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. లేదా ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్‌లతో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..