TSRTC: ‘హైదరాబాద్‌ దర్శన్‌’ పేరుతో స్పెషల్‌ ప్యాకేజ్‌.. టూరిస్ట్‌ల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు..

పార్కులు, చారిత్రక కట్టడాలు ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు నగరవాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు సందర్శనకు వస్తుంటారు. అయితే నగరానికి కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ ఏ బస్సు ఎక్కాలి.?

TSRTC: హైదరాబాద్‌ దర్శన్‌ పేరుతో స్పెషల్‌ ప్యాకేజ్‌.. టూరిస్ట్‌ల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు..
Tsrtc Hyderabad Darshan

Updated on: Oct 14, 2022 | 12:07 PM

పార్కులు, చారిత్రక కట్టడాలు ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు నగరవాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు సందర్శనకు వస్తుంటారు. అయితే నగరానికి కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ ఏ బస్సు ఎక్కాలి.? గమ్య స్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎలాంటి టెన్షన్‌ లేకుండా నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా వీలు కల్పించింది. వారాంతాల్లో శని, ఆదివారాల్లో ఈ స్పెషల్‌ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది.

పాఠశాల యాజమాన్యాలు, కాలేజీ స్టూడెంట్స్‌, కుటుంబాలకు, ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకునే పెద్దలు రూ. 250, చిన్నారులు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో లగ్జరీ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ. 450, చిన్నారులు రూ. 340 చెల్లించాలి. టికెట్లను ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. అలాగే పూర్తి సమాచారం కోసం 040-23450033 or 040-69440000 నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్యాకేజ్‌ పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ దర్శన్‌ ప్యాకేజీలో భాగంగా ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్‌, తర్వాత 10.30 నుంచి 12.30 వరకు చౌమల్లా ప్యాలెస్‌, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బరాదరి రిసార్ట్స్‌, 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కోండ కోట, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్‌ బ్రిడ్జ్‌, 6.30 నుంచి 7.30 గంటల వకు హుస్సేన్‌ సాగర్‌, ఎన్‌టీఆర్‌ పార్క్‌లను సందర్శించవచ్చు. మొత్తం 12 గంటల పాటు జర్నీ సాగుతుంది. తిరిగి రాత్రి 8.30 గంటలకు ఆల్ఫ హోటల్‌ దగ్గర దించుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..