AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Inter Results: అఫీషియల్ వచ్చేసింది.! ఇంటర్‌ ఫలితాలు రేపే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చూసేయండి

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 వార్షిక పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) విడుదల చేయనుంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తేలనుండగా, ఈసారి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లతో పాటు టీవీ9 తెలుగు సైట్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా చూసుకునే వెసులుబాటు ఉంది.

Telangana Inter Results: అఫీషియల్ వచ్చేసింది.! ఇంటర్‌ ఫలితాలు రేపే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చూసేయండి
Telangana Inter Results 2026
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 6:35 PM

Share

తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం అనగా ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 9.97 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ప్రథమ సంవత్సర పరీక్షలకు 4.41 లక్షల మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు సుమారు 5.07 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాలను సిద్ధం చేసినట్లు బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు టీవీ9 తెలుగు వెబ్ పోర్టల్‌లోనూ చూడవచ్చు.

వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in, results.cgg.gov.in, tv9telugu.com

విధానం: వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్‌ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే మార్కుల మెమోను పొందొచ్చు.

ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి ‘A’ గ్రేడ్, 60 నుంచి 74 శాతం మధ్య వచ్చిన వారికి ‘B’ గ్రేడ్ కేటాయిస్తారు. ఫలితాల అనంతరం మార్కులతో అసంతృప్తిగా ఉన్న వారికి రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ చేసుకునే అవకాశం కూడా బోర్డు కల్పిస్తుంది.

Inter Results

Follow Us