రాజగోపాల్‌ రెడ్డికి అందుకే మంత్రి పదవి రాలేదు-TV9 క్రాస్‌ఫైర్‌లో పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు!

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అంశంపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డికి మాటిచ్చింది నిజమేనని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కేబినెట్‌లో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పదవి ఉండటం వల్లే.. రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

రాజగోపాల్‌ రెడ్డికి అందుకే మంత్రి పదవి రాలేదు-TV9 క్రాస్‌ఫైర్‌లో పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
Mahesh's Good Comments On Rajagopal Reddy

Updated on: Aug 17, 2025 | 9:21 PM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అంశంపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డికి మాటిచ్చింది నిజమేనని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కేబినెట్‌లో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పదవి ఉండటం వల్లే.. రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి BRS పార్టీలోనే ఉండిఉంటే ఇలానే మాట్లాడేవారా..? అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండే వారికి చాలా ఓపిక ఉండాలని ఆయన అన్నారు. మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనతోనే రాజగోపాల్‌ రెడ్డి అలా మాట్లాడుతున్నారని మహేష్‌ గౌడ్ అన్నారు.

మరోవైపు తన పాదయాత్రపై కూడా పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్ర సందర్భంగా తనకు గిట్టని వాళ్లు కొందరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన పాదయాత్రకు సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ అన్నారు. పాదయాత్ర చేస్తే అన్ని రకాల సహకారాలు ఇప్పిస్తామని సీం రేవంత్ చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంతే కాకుండా త్వరలో వీలు చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పాదయాత్రలో పాల్గొంటారని మహేష్‌ కుమార్ గౌడ్ అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.