రాత్రివేళల్లో ‘చార్మినార్’కు కొత్త అ౦దాలు

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 6:48 PM

హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా చార్మినార్ చూడాల్సి౦దే. అంతటి మహాద్భుతమైన కట్టడం పర్యాటకులకు మరింత కనువిందు చేయనుంది. రాత్రివేళల్లో చార్మినార్ మరింత అందంగా కనిపించేందుకు అధికారు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ వెలుపల 190 వాట్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చడానికి సిద్ధమవుతున్నారు ఎల్‌ఈడీ బల్బుల ధగధగలతో మెరిసిపోయేందుకు చార్మినార్ సిద్ధమవుతోంది. దీంతో దూరం నుంచి కూడా చార్మినార్ అందంగా కనిపించనుంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం ఎదురుగా నిర్మించనున్న వంతెనతో పాటు చిరు వ్యాపారుల […]

రాత్రివేళల్లో చార్మినార్కు కొత్త అ౦దాలు
Follow us on

హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా చార్మినార్ చూడాల్సి౦దే. అంతటి మహాద్భుతమైన కట్టడం పర్యాటకులకు మరింత కనువిందు చేయనుంది. రాత్రివేళల్లో చార్మినార్ మరింత అందంగా కనిపించేందుకు అధికారు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ వెలుపల 190 వాట్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చడానికి సిద్ధమవుతున్నారు ఎల్‌ఈడీ బల్బుల ధగధగలతో మెరిసిపోయేందుకు చార్మినార్ సిద్ధమవుతోంది. దీంతో దూరం నుంచి కూడా చార్మినార్ అందంగా కనిపించనుంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాలార్‌జంగ్ మ్యూజియం ఎదురుగా నిర్మించనున్న వంతెనతో పాటు చిరు వ్యాపారుల కోసం నయాపూల్ దగ్గర మరో వంతెన నిర్మించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇప్పటికే ఆ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోంది. చార్మినార్‌ ప్రాజెక్టులో భాగంగా ఉపాధి కోల్పోయే చిరు వ్యాపారులకు ఈ వంతెనలు ఊరట కలిగించనున్నాయి. వీటిపై చిరు వ్యాపారాలు జరుపుకొనే అవకాశం కల్పించనున్నారు అధికారులు. టూరిస్టులు వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఓ మల్టీ కాంప్లెక్స్ కూడా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు.