Hyderabad: బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా రెప్పపాటులో ఘోర ప్రమాదం.. చివరకు..

మృతులు బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ద్విచక్రవాహనం శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి.. డివైడర్‌ వైపు దూసుకెళ్లిందని.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

Hyderabad: బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా రెప్పపాటులో ఘోర ప్రమాదం.. చివరకు..
Road Accident

Updated on: Jan 28, 2025 | 8:23 AM

మితిమీరిన అతివేగం.. ట్రిపుల్‌ రైడింగ్‌.. మూడు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్‌లో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లి వద్ద కొత్తగా ప్రారంభించిన ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను గోల్కొండకు చెందిన మాజ్, అహ్మద్..తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్‌గా గుర్తించారు. బహుదూర్‌పూర్‌ నుంచి ఆరాంఘర్‌ మార్గంలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌పై ముగ్గురు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా.. డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు స్థానికులు. బైక్‌పై ఉన్న ముగ్గురిని మైనర్లుగా గుర్తించారు.

మృతులు బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ద్విచక్రవాహనం శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి.. డివైడర్‌ వైపు దూసుకెళ్లిందని.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. అతివేగం, ట్రిబుల్ రైడింగ్ ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..