హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ రోడ్డు ఘటన.. పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి మామిడిపల్లి ఆదోని ఏదో స్పేస్ 2 వద్ద శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయాలైన వారిలో యువకుడు, ఓ మహిళకు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ టోలిచౌకి మైలార్దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన రాజ్ మహమ్మ ద్, మహమ్మద్ అక్బర్, నజియా బేగం, నయమ్ముద్దిన్ , ముస్కాన్ మిరాజ్ స్నేహితులు కలిసి మారుతి బెలూనో కారు (TS 23 FA 2843) లో మైలార్‌దేవ్‌పల్లి మీదుగా మామిడిపల్లి ఏరోస్పేస్ 2 వైపు వెళుతున్నారు.
అయితే, రాజ్ మహమ్మద్ కారు నడుపుతున్నాడు. కారు స్పీడులో ఉండగా.. అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ మహమ్మద్, మహమ్మద్ అక్బర్, నజియా బేగం సంఘటన స్థలంలో మృతి చెందారు. నయముద్దీన్ ముస్కాన్ మిరాజ్ లకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పహడి షరీఫ్ పోలీసులు క్షతగాత్రులను మైలార్దేవ్ పల్లి లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..