AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫోన్​ ఎలా కొట్టేశాడో చూడండి.. పెద్ద స్కెచ్చే ఇది..

అనుకుంటాం కానీ.. దొంగతనం చేయడానికి కూడా తెలివితేటలు చాలా అవసరం అనిపిస్తుంది ఈ సంఘటన గురించి వింటుంటే. ఒక మనిషిని ఎలా మోసం చేయాలి.. ఎలా వాళ్ల దగ్గర ఉన్నది దోచుకోవాలని పెద్ద ప్లాన్‌తోనే వస్తారు దొంగలు. కన్నుమూసి తెరిచే లోపు మనిషిని మాటల్లో పెట్టి దోచేసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.

Telangana: ఫోన్​ ఎలా కొట్టేశాడో చూడండి.. పెద్ద స్కెచ్చే ఇది..
Thief Stole Phone
Noor Mohammed Shaik
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 20, 2024 | 4:24 PM

Share

మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్ బాగ్‌లో ఉదయం పాల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వద్ద నుంచి అందరూ చూస్తుండగానే దర్జాగా జేబు నుంచి దుండగులు మొబైల్ ఫోన్ కొట్టేశారు. ఎలా అంటారా?.. షాపులో ఏదైనా కొనడానికి వచ్చినప్పుడు ఎక్కువ మంది గుమిగూడి ఉన్నప్పుడు దృష్టి అంతా మనం తీసుకోవాల్సిన వస్తువు మీదే ఉంటుంది. అలాంటి హడావిడి సమయాల్లో మీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టిని మరల్చారు. నేల మీద ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఆ వ్యక్తి వంగినప్పుడు తీరిగ్గా ఇటు జేబులో ఉన్న ఫోన్ మాయం చేశారు. ఆ హడావిడిలో ఆ వ్యక్తి జరిగేది గమనించకుండా తరువాత ఫోన్ పోయినట్లు సదరు వ్యక్తి గ్రహించాడు. తీరా అప్పటికే దొంగతనానికి పాల్పడ్డ వారు అక్కడి నుంచి పరారైయ్యారు. అప్పటికే దగ్గర్లోనే బండి స్టార్ట్ చేసి ఇతని కోసం మరో ఇద్దరు యువకులు వేచి ఉన్నారు. ఇంకేముంది.. దొంగతనం చేసిన నిందితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకుని బండిపై ఎక్కి వాళ్లతో పాటు పరారైయ్యాడు. జరిగింది గ్రహించిన అనంతరం బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుంచి కూడా ఇలాగే మొబైల్ చోరీ జరిగింది. ఇలా ఒకే రోజు రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వీడియో  ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్