Revanth Reddy: కష్టమే కానీ.. అసాధ్యం అయితే కాదు.. ఐఎస్‌బీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రజలతో మమేకమైతే ఏదైనా సాధించవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని తెలిపారు. శంలోని నగరాలతో కాదు న్యూయార్క్, ప్యారిస్ లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటూ పేర్కొన్నారు.
తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలనేదే లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సాధ్యం కావాలంటే 600 బిలియన్ డాలర్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి కావాలన్నారు. కష్టమే అయినా.. అసాధ్యం మాత్రం కాదంటూ పేర్కొన్నారు. దేశంలోని నగరాలతో కాదు న్యూయార్క్, ప్యారిస్ లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటూ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు – 2024లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం పలు సూచనలు చేశారు. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేమంటూ పేర్కొన్నారు. మంచి లీడర్ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలన్నారు.
గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఎస్బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని 600 మిలియన్ సిటీగా మార్చేందుకు అంతా సహకారం అందించాలని కోరారు. ప్రజలతో మమేకమైతే ఏదైనా సాధించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తమ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్‌ను మాత్రం అందిస్తుందని చెప్పారు. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
వీడియో చూడండి..
రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీల ప్రాధాన్యత, వాటి ప్రాముఖ్యతలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చెప్పారు.
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు (#ISBACON2024) లో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు… pic.twitter.com/51A6X3mYWO
— Telangana CMO (@TelanganaCMO) October 20, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..