విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరా (Power supply) లో అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. వారు అందించిన సమాచారం వేరకు వివరాలిలా ఉన్నాయి.
*ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ్ నగర్ ఫీడర్ పరిధిలోని ఆదర్శ నగర్, బిర్లా మందిర్, ఇంజినీర్ల సంఘం కార్యాలయం, ఈఎస్ఐ, ఆదర్శ్ కేఫ్ అండ్ బేకరీ, మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి, జలమండలి, షాపూర్ జీ టవర్స్, బాగారెడ్డి డీటీఆర్, సంజయ్ గాంధీ నగర్, బిర్లా ప్లానీటోరియంలో విద్యుత్ సరఫరా ఉండదు.
* ఇదే సమయంలో నిజామ్ కళాశాల ఫీడర్ పరిధిలోని నిజాం కళాశాల, లాకాలేజ్, యునైటెడ్ ఇన్సూరెన్స్ బిల్డింగ్, బాహర్ కేఫ్, కింగ్ కోఠి, షేర్ గేట్, హైలెన్ చౌరస్తా, భారతీయ విద్యా భవన్, హైదర్ గూడలోని బికనీర్ వాలా స్వీట్ షాప్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
*ఉదయం 10. 30 నుంచి ఒంటి గంట మధ్య జూబ్లీహిల్స్ రోడ్ నంబర్. 78, పద్మాలయా స్టూడియో, ఈశ్వర వల్లీ, బాబూ జగ్జీవన్ రామ్ కాలనీ, పద్మాలయా స్లమ్, మధురా నగర్- జీ బ్లాక్, దేవరాయ నగర్, సారా డిపో, యూసుఫ్ గూడ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాలు..
*మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఎన్టీఆర్ మార్గం, లుంబనీ పార్కు ఎదుటి ప్రాంతం, అమోఘం హోటల్, హనుమాన్ టెంపుల్, బాబూఖాన్ ఎస్టేట్, ఎల్బీ స్టేడియం మెయిన్ రోడ్, పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజాం హాస్టల్, జగదాంబ జువెలర్స్, సంజీవయ్య పార్క్, గ్రీన్ ల్యాండ్స్, ఆల్విన్ సబ్ స్టేషన్ పరిధిలోని ఎస్పీటీ నగర్, ప్రకాశ్ నగర్, శ్రీనివాస టవర్స్, అమోఘ్ ప్లాజా, బ్లూ మూన్ హోటల్, ఎర్రగడ్డ మెయిన్ రోడ్, ఎఫ్ సీఐ గోడౌన్ తదితర ప్రాంతాలు..
*మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు.. బీజేఆర్ కాలనీ, రామానాయుడు స్టూడియో, మధురా నగర్, యూసుఫ్ గూడ మెయిన్ రోడ్, దేవరాయ నగర్, సారా డిపో, వెల్లంకి ఫుడ్స్ ఎదురుగా ఉన్న ప్రాంతాలు..
*ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు.. ప్రకాశ్ నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియా, సంజీవయ్య పార్క్, ఆర్కా మసీద్, కామత్ లింగాపూర్, ప్రకాశ్ నగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతాలు..
Paracetamol: జ్వరం తగ్గించే పారాసిటమాల్‌తో పాములు చంపుతున్న అమెరికా.. ఎందుకనేగా.?
US- Canada border: ‘డాలర్ డ్రీమ్స్’ లో ఆ గ్రామ ప్రజలు.. అదే ప్రాణాల మీదకు తెస్తోంది..