Young woman died : కూకట్‌పల్లిలో ఘోరం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలి

ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయిన‌ సంఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..

Young woman died : కూకట్‌పల్లిలో ఘోరం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలి
Kukatpalli Building

Updated on: Jul 07, 2021 | 10:48 PM

Kukatpalli : ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయిన‌ ఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి విలేజ్ లో గల మూడు అంతస్తుల భవనం 3వ అంతస్తులో రెయిలింగుకు బీటలువారాయి. ఇదే విషయం ఆ ఇంటిలో అద్దెకు ఉండేవారు యజమానికి తెలియజేశారు. అయినా ఆ ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించాడు.

రాత్రి 8 గంటల సమయంలో స్థానికంగా నివసించే రోజా(25) ఆ భవంతిలో గల ఎంబ్రాయడరి సెంటరుకు వచ్చింది. ఆ సమయంలో 3వ అంతస్తు పెచ్చులు ఊడి రోజా తలపై పడటంతో తీవ్రగాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. ‌

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read also: Nara Lokesh : కోన‌సీమ రైతులు క్రాప్‌హాలీడే ప్రక‌ట‌న‌లు వెన‌క్కి తీసుకునేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకోవాలి : నారా లోకేష్