Telangana: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. అనుకున్న సమయానికే

|

Jun 09, 2022 | 4:44 PM

రోహిణి వెళ్లిపోయి మృగశిర ప్రవేశించినా వాతావరణం చల్లబడటం లేదు. రోహిణిలో మాడు పగిలే ఎండలతో మృగశిరలో ఉపశమనం పొందవచ్చనుకున్న జనానికి భానుడి భగభగలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా...

Telangana: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. అనుకున్న సమయానికే
Follow us on

రోహిణి వెళ్లిపోయి మృగశిర ప్రవేశించినా వాతావరణం చల్లబడటం లేదు. రోహిణిలో మాడు పగిలే ఎండలతో మృగశిరలో ఉపశమనం పొందవచ్చనుకున్న జనానికి భానుడి భగభగలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా నమోదవతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో ఐఎండీ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న సమయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవానాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముందస్తు అనుకున్నట్లుగానే ఇవి వస్తాయని, వీటి రాకలో ఎలాంటి ఆలస్యం లేదని తెలిపారు. మే 31 నుంచి జూన్​ 7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ(Kerala) సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని వివరించారు. రుతుపవనాల రాకలో ఎలాంటి ఆలస్యం లేదన్న వాతావరణశాఖ.. రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

అంతేకాకుండా ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బలమైన గాలులు వీయడం, మేఘాలు దట్టంగా కమ్ముకోవడం చూస్తామన్నారు. గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులో.. రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా.. గతేడాది తో పోలిస్తే ఈ సారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందే పలకరించాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే ‘నైరుతి’ మూడు రోజుల ముందుగానే వచ్చేసింది. మే 29న కేరళను రుతుపవనాలు తాకాయి. అక్కడే స్థిరంగా ఉండి 4 రోజులకు కర్ణాటక, తమిళనాడును తాకాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి