విద్యా దందా కోరలు చాచింది. రోజురోజుకి విస్తరిస్తున్న కార్పోరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై టీవీ9 చేసిన నిఘాలో మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. ఎల్కేజీ అడ్మిషన్లకే లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. సరైన ప్లేగ్రౌండ్ ఉండదు. పిల్లలు స్కూల్లోనే తినాలి. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాలి. ఒక్క ఫీజుతోనే సరిపోదు ఫీల్డ్ ట్రిప్, ప్రాజెక్టు వర్క్, స్పోర్ట్స్, లాబ్స్, లైబ్రరీ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తారు. వీటికి రసీదులు కూడా ఉండవు. నగరంలో ప్రముఖ ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఈ విధంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.