Fuel price hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై కన్నెర.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీసిన కాంగ్రెస్

దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఆకాశాన్నంటుతోన్న పెట్రో ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో..

Fuel price hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై కన్నెర.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీసిన కాంగ్రెస్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద పీసీసీ కొత్త వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండితో నిరసన తెలిపారు.

Updated on: Jul 12, 2021 | 2:14 PM

Telangana Congress Agitation: దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఆకాశాన్నంటుతోన్న పెట్రో ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో ఇవాళ భారీ ర్యాలీ తీసింది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యదవ్, గీతారెడ్డి, ఫైరోజ్ ఖాన్ అధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఎడ్లబండిపై అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి తమ అనుచరులతో వచ్చి పెట్రో నిరసన తెలియజేశారు. పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలను కంట్రోల్‌లో పెట్టాలన్నారు. ఒక దశలో పరిస్థితి చేజారుతుండటంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Anjankumar Yadav

Read also: Telangana Rains: అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ