Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి!

|

Sep 29, 2023 | 11:48 AM

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 28) జరిగిన గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేరేవేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సంజీవయ్య పార్కు వద్ద వాహనంలో గణపతిని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు వాహనం కింద పడి చనిపోయాడు. మృతి చెందిన బాలుడిని కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌ కుమార్‌గా గుర్తించారు. మరో ఘటనలో నాలుగేళ్ల బాలుడు బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో వాహనం కిందపడి..

Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి!
Ganesh Immersion Procession
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 28) జరిగిన గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేరేవేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సంజీవయ్య పార్కు వద్ద వాహనంలో గణపతిని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు వాహనం కింద పడి చనిపోయాడు. మృతి చెందిన బాలుడిని కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌ కుమార్‌గా గుర్తించారు. మరో ఘటనలో నాలుగేళ్ల బాలుడు బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో వాహనం కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు.

గణేశ్‌ నిమజ్జనానికి బైక్‌పై వెళ్తూ..

నగరంలోని సంతోష్‌నగర్‌ ప్రెస్‌కాలనీలో నివాసం ఉంటోన్న రాజశేఖర్‌ కుటుంబం గురువారం గణేశ్‌ నిమజ్జనం వీక్షించేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కుటుంబంతో కలిసి ఆయన ద్విచక్ర వాహనంలో వస్తుండగా.. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. దీంతో బైక్‌పై ఉన్న వారంతా కిందపడిపోయారు. సరిగ్గా అదేసమయంలో అటుగా వస్తున్న మరో వాహనం కిందపడ్డ ఆయుష్‌ (4) పైనుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని హుటాహుటీన నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలుడు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

గణేష్ నిమజ్జనంలో విషాదం.. మూడు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు..

గుజరాత్‌లోని పంచమహల్, దాహోద్, ఆనంద్ జిల్లాల్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం జరిగిన మూడు వేరువేరు ప్రమాదాల్లో 11 మందికి గాయాలు అవగా.. మరో ఇద్దరు మృతి చెందారు. ఆనంద్‌ జిల్లా ఖంభాట్ పట్టణంలోని లడ్వాడ నివాసితులు సందీప్ కోలి, అమిత్ ఠాకోర్ నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి

పంచమహల్ జిల్లా పావగఢ్ కొండ దిగువన ఉన్న వాడా తలావ్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేయడానికి వచ్చిన హైడ్రాలిక్ క్రేన్ బోల్తా పడడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్రేన్ మెకానిజంలో బెల్ట్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా క్రేన్ బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక దాహోద్‌లోని నవగామ్‌లో గణేష్ విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో 18 ఏళ్ల యువకుడు కొట్టుకుపోయాడు. కొందరు యువకుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.