AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేసేందుకు మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?

వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా..? ఏదైనా ప్రాంతానికి వెళ్లి ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో చిల్ అవ్వాలనుకుంటున్నాారా..? అయితే హైదరాాబాద్‌లో ఉండే ప్రజలకు గుడ్‌న్యూస్. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారి కోసం త్వరలో మరో రెండు స్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇందులో తెలుసుకుందాం.

Hyderabad: హైదరాబాదీలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేసేందుకు మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?
Tankbund
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 12:39 PM

Share

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్, గొల్కోండ కోట, ట్యాంక్‌బండ్ లాంటి టూరిస్ట్ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్లు వంటికి నగరంలో ఎక్కడికక్కడ ఉన్నాయి. వీకెండ్‌లో ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, ఆఫీస్ కోలీగ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇవి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అయితే వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకునేవారి కోసం నగరంలో త్వరలో మరో రెండు స్పాట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. నీటిపై తేలియాడుతూ సముద్రం ఫీల్‌ను ఎంజ్ చేస్తూ చక్కగా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హాయిగా గడపాలనుకునేవారి కోసం టూరిజం శాఖ రెండు టూరిస్ట్ ప్రదేశాలను అభివృద్ది చేయనుంది.

త్వరలోనే హౌజ్ బోట్ల సౌకర్యం

నగరంలో ట్యాక్‌బండ్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. భాగ్యనగరంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ ఎప్పుడూ జనాలు సందడి చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం, రాత్రి సమయాల్లో అయితే ప్రజలు ఇక్కడ తెగ ఉంటారు. ఇప్పటికే ట్యాక్‌బండ్‌లో విహరించేందుకు బోటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. బోట్‌లో తిరుగుతూ నీళ్లల్లో ట్యాక్‌బండ్ మొత్తం చుట్టేయవచ్చు. అయితే త్వరలో హౌజ్ బోటులను కూడా తెలంగాణ టూరిజం ప్రవేశపెట్టనుంది. వీటిల్లో రెండు డబుల్ బెడ్రూంలు ఉంటాయి. అలాగే ఈ బోటుల్లో ఫుడ్ క్యాంటీన్లతో పాటు ఇతర సౌకర్యాలు అన్నీ ఉంటాయి. నీటిపై తేలియాడే ఇల్లు లాంటి ఈ బోటుల్లో వీకెండ్స్‌లో మంచిగా చిల్ అవ్వొచ్చు. ఫ్యామిలీ కోసం బెడ్ రూమ్స్ కూడా వీటిల్లో ఉంటాయి.

దుర్గం చెరువులో 6 బోట్లు

హుస్సేన్ సాగర్‌లో రెండు హౌజ్ బోట్లను ప్రవేశపెట్టనుండగా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక దుర్గం చెరువులో 6 బోట్లను తీసుకురానున్నారు. ఒక్కో బోటులో రెండు డబుల్ బెడ్ రూంలు ఉంటాయి. దీంతో మొత్తం 12 బెడ్ రూంలు అందుబాటులో ఉంటాయి. ఈ బోట్ల నిర్వహణ, బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించనుందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వమే నిర్వహించాలా లేదా పీపీపీ పద్దతిలో నిర్వహించాలా అనే దానిపై కూడా ఆలోచనలు చేస్తోంది. త్వరలో ఈ హౌజ్ బోట్లు ట్యాక్ బండ్, దుర్గం చెరువుల్లో అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇప్పటికే నగరంలో అనేక టూరిస్ట్ స్పాట్స్ ఉండగా.. వీటి రాకతో నగరంలో ప్రజలకు మరో కొత్త అనుభూతి కలగనుంది. నగరంలో వీకెండ్ వస్తే పర్యాటక ప్రదేశాలు అన్నీ జనాలతో కిక్కిరిసి ఉంటాయి. దీంతో ఈ హౌజ్ బోట్లు సక్సెస్ అవుతాయని పర్యాటకశాఖ అధికారులు భావిస్తున్నారు.

Follow Us
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!