
TSRTC Tweet: ఆర్టీసీ ఎండీగా సజ్జనర్ నియమితులైన తర్వాత ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని, పెళ్లి బస్సులకు రాయితీతో పాటు, వివాహ జంటకు బహుమతులు ఇవ్వడం లాంటి నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల పాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఆర్టీసీని ఎక్కువ మంది ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్‌ను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంక్రాంతి పండుగకు గాను సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులనే ఉపయోగించుకోవాలంటూ ఓ మీమ్‌ను రూపొందించారు.
అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పేందుకు టీఎస్ ఆర్టీసీ హీరో మహేష్ బాబు డైలాగ్‌ను వాడుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్, పృథ్వీరాజ్‌ల మధ్య జరిగిన సంభాషణను మీమ్‌గా మార్చేశారు. ఇందులో పృథ్వీ మహేష్‌తో మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి మన ఊరు వెళ్దాం అంటేనే భయమేస్తోంది అయ్యా, అన్ని టికెట్స్ రేట్లు పెంచేశారు. ఎక్కడా సేఫ్టీ కూడా లేదు’ అని అంటాడు. దీనికి మహేష్ బాబు స్పందిస్తూ.. ‘అందుకే బాబాయ్ నాలా సంక్రాంతికి TSRTCలో టిక్కెట్ బుక్ చేస్కో, తక్కువ ధరతో భద్రతతో కూడిన ప్రయాణం చేసేయ్’ అంటాడు. ఇలా రూపొందించిన మీమ్‌ను ట్వీట్ చేసిన సజ్జనర్.. ‘తక్కువ ధరలో బస్సు టిక్కెట్టు, శుభప్రదమైన సుఖ ప్రయాణం TSRTCలోనే’ అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు.. ఆర్టీసీ ప్రమోషన్ చూసి ఫిదా అవుతున్నారు.
Books your tickets for Sankranti vacation now and avoid the last-minute hassle. #TravelWithTSRTC
తక్కువ ధరలో బస్సు టిక్కెట్టు మరియు శుభప్రదమైన సుఖ ప్రయాణం #TSRTC లోనే@TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @urstrulyMahesh @onlymaheshfans @baraju_SuperHit @TrackTwood pic.twitter.com/xlAphzF35l
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 26, 2021
ఓలా స్కూటర్ నిరీక్షణకు తెర !! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ ప్రారంభం !! వీడియో