TSRTC: రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా పదవి స్వీకరించిన తర్వాత తెలంగాణ ఆర్టీసీలో పలు కీలక మార్పులు చేశారు. కార్గో సేవలు, పెళ్లి బస్సులకు ప్రత్యేక రాయితీలు, ఫాదర్స్‌డే.. మధర్స్ డే రోజున పేరెంట్స్‌కు ఉచితంగా బస్సు సౌకర్యం ఇలా నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రయాణికులు అట్రాక్ట్ చేస్తూ వస్తోంది టీఎస్‌ఆర్టీసీ. ఈ క్రమంలోనే ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారు ఎవరైనా లోకల్ బస్సులో ప్రయాణం చేస్తే వారికి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో 2 గంటల వరకూ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. హాస్పిటల్‌లో డాక్టర్లు రాసిన మందుల ప్రిస్కిప్షన్‌లో ఉండే సమయం ఆధారంగా 2 గంటల సమయాన్ని నిర్ధేశించనున్నారు. ప్రిస్క్రిప్షన్‌ను చూపించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
ఇదిలా ఉంటే కేవలం ఆసుపత్రులకు వెళ్లే వారికి మాత్రమే కాకుండా. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే వారికి కూడా 2 గంటలు సిటీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో నగరానికి చేరుకున్న వారు నగరంలో ఎక్కడ దిగినా సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సామ్యుల్ తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..