తెలంగాణలో మళ్లీ ‘పవర్’ ఫుల్ యుద్ధం.! రాజుకుంటున్న మాటల మంటలు..

Big News Big Debate: తెలంగాణలో మరోసారి పవర్‌ఫుల్‌ యుద్ధానికి తెరలేచింది. అటు పథకాలు.. ఇటు కరెంట్‌పైనా మాటలమంటలు రాజుకుంటున్నాయి. నోటిఫికేషన్‌ కంటే ముందే నగదు బదిలీ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్‌ అంటే.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మరోవైపు రైతులకు ఉచితవిద్యుత్‌పైనా పార్టీల మద్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది.

తెలంగాణలో మళ్లీ పవర్ ఫుల్ యుద్ధం.! రాజుకుంటున్న మాటల మంటలు..
Big News Big Debate

Updated on: Oct 26, 2023 | 6:48 PM

తెలంగాణలో మరోసారి పవర్‌ఫుల్‌ యుద్ధానికి తెరలేచింది. అటు పథకాలు.. ఇటు కరెంట్‌పైనా మాటలమంటలు రాజుకుంటున్నాయి. నోటిఫికేషన్‌ కంటే ముందే నగదు బదిలీ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్‌ అంటే.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మరోవైపు రైతులకు ఉచితవిద్యుత్‌పైనా పార్టీల మద్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా తెరమీదకు వచ్చింది ఉచిత కరెంట్. ఒకప్పుడు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విదేశాల్లో అన్నట్టు 3గంటల కరెంట్ పథకమే కర్నాటకలో అమలు అవుతుందంటోంది బీఆర్ఎస్‌. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పక్క రాష్ట్రంలో రైతులకు కరెంట్‌ ఇవ్వలేక చతికిలపడితే ఉద్యమాలు జరుగుతున్నాయని.. తెలంగాణలోనూ గెలిపిస్తే రైతులు నష్టపోతారంటోంది బీఆర్ఎస్‌. ఎన్నికల్లో ఓడితే తనకు వచ్చే నష్టం లేదని… కానీ ప్రజలే ఇబ్బందులు పడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌.

మరోవైపు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు సహా నగదు బదిలీ పథకాలను నోటిఫికేషన్‌ కంటే ముందే అమలు చేయాలని పట్టుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని.. అయితే ఎన్నికల నేపథ్యంలో నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు హస్తం నేతలు. కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారిందన్నారు మంత్రి హరీష్‌రావు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు హస్తం పార్టీ కుట్రలకు తెరతీసిందన్నారు. రైతుబంధు ఆపితే 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కకుండా చేస్తారన్నారు మంత్రి హరీష్‌రావు. మొత్తానికి కరెంట్‌ మంటలు అలా రాజుకుంటే.. రైతుబంధు వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇంతకీ ఎన్నికల సంఘం పథకాలపై ఏం చెప్పబోతుంది?

ఈ అంశానికి సంబంధించి టీవీలో జరిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియోను ఇక్కడ చూడండి..