Phone Tapping Case: బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీకి సిట్‌ నోటీసులు.. సంతోష్‌ ఏమన్నారంటే.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) వేగవంతం చేసింది. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది.. ఈ మేరకు సిట్ అధికారులు  విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు..

Phone Tapping Case: బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీకి సిట్‌ నోటీసులు.. సంతోష్‌ ఏమన్నారంటే.
Brs Leader Santosh Rao

Updated on: Jan 26, 2026 | 8:25 PM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) వేగవంతం చేసింది. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది.. ఈ మేరకు సిట్ అధికారులు  విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. 160 సీఆర్‌పీసీ ప్రకారమే సంతోష్‌కి నోటీసులు వెళ్లాయి. అయితే.. సంతోష్‌ని ఎంపీగానే పేర్కొంటూ సిట్ నోటీసు ఇచ్చింది. అయితే.. సిట్ విచారణకు హాజరవుతానంటూ సంతోష్‌రావు ప్రకటించారు. చట్టాన్ని గౌరవిస్తానని.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు..

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను కొన్ని రోజులుగా సిట్ స్పీడప్ చేసింది. ఇదే కేసులో గత మంగళవారం హరీష్‌రావును సిట్ విచారించింది. 7 గంటలపాటు హరీష్‌రావును అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత శుక్రవారం నాడు కేటీఆర్‌ను కూడా అధికారులు విచారించారు. కేటీఆర్ కూడా 7 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరినీ ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరున్నర వరకూ అధికారులు విచారించారు. కానీ సంతోష్‌రావును మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. సంతోష్‌రావును ఏ ప్రశ్నలు అడగబోతున్నారు. ఆ తర్వాత ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

డైవర్షన్ కోసమే నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారే తప్ప.. ఈ కేసులో పసలేదని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని బీఆర్‌ఎస్ నేతలు వాదిస్తున్నారు. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..