Hyderabad: సూర్యపేటలో మరో గురుకుల విద్యార్ధిని ఆత్మహత్య.. వారం వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం

సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గురుకులంలో చదువుతోన్న ఇంటర్మీడియట్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల వ్యవధిలోనే పదో తరగతి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని తన ఇంట్లోనే శనివారం (ఫిబ్రవరి 17) ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సూర్యాపేటలో జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన..

Hyderabad: సూర్యపేటలో మరో గురుకుల విద్యార్ధిని ఆత్మహత్య.. వారం వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం
Gurukul Student Dies By Suicide

Updated on: Feb 18, 2024 | 3:39 PM

సూర్యాపేట, ఫిబ్రవరి 18: సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గురుకులంలో చదువుతోన్న ఇంటర్మీడియట్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల వ్యవధిలోనే పదో తరగతి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని తన ఇంట్లోనే శనివారం (ఫిబ్రవరి 17) ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సూర్యాపేటలో జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్‌, జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత (15). అస్మిత ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతుంది. అయితే ఫిబ్రవరి 10న అదే గురుకుల స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈనేపథ్యంలో విద్యార్ధులందరినీ వారి ఇళ్లకు పంపించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి 4 రోజులపాటు హోం సిక్‌ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిక కూడా తల్లిదండ్రులతో తమ ఇంటికి వచ్చింది.

సోమవారం తరగతులు పున:ప్రారంభం కానున్నాయని, రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండమని అస్మితకి తల్లి జ్యోతి చెప్పింది. అనంతరం రోజువారీ లానే అస్మిక తల్లి శనివారం ఉదయం కూలి పనికి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కి అస్మిత ఉరి వేసుకుని కనిపింది. దీంతో అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వచ్చే రెండు నెలల్లో విద్యార్ధులకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల విద్యార్ధులు పరీక్షల భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్నోలో మరో ఘటన.. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన 12వ తరగతి విద్యార్థి మహ్మద్ డేనియల్ ఆదివారం ఉదయం 5.53 గంటలకు ఉరివేసుకుని మృతి చెందాడు. తాను చేసిన తప్పులు క్షమించరానివని, పశ్చాత్తాపంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నానని, క్షమించమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీ (CUO) కోరాపుట్‌లో ఓ విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి తపన్ కుమార్ దాస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.