Telangana Politics: విలీనమా.. విమోచనమా..? తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సెప్టెంబర్‌ 17

సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు.. తెలంగాణలో రాజకీయం నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్తోంది. సెప్టెంబరు 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో గుర్తు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ సంబరాలకు సిద్ధమైన కమలం పార్టీపై విమర్శస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు.

Telangana Politics: విలీనమా.. విమోచనమా..? తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సెప్టెంబర్‌ 17
Telangana Liberation Day

Updated on: Sep 16, 2025 | 11:48 AM

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. విలీనమా..? విమోచనమా.. అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇది కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో మూడో ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాబోతున్నారు.

సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విమోచనే పుస్తకం ఆవిష్కరణ

గ్రామ గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించి, విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని కేడర్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనే అనే పుస్తక ఆవిష్కరణ చేశారు మాజీ గవర్నర్‌ విద్యాసాగర్.

పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్లతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు

బీజేపీ నేత గూడురు నారాయణరెడ్డి తీసిన రజాకార్ సినిమా, జాతీయవాద భావాలున్న కవులు రాసిన విమోచన దినోత్సవ అంశాల పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్లతో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించడం, కీలక ఘట్టాలకు ఆనవాళ్లైన ప్రాంతాల సందర్శన లాంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది కమలం పార్టీ. అంతేకాదు అన్ని జిల్లాల నుంచి ప్రజలను విమోచన దినోత్సవ వేడుకలకు తీసుకొచ్చేలా ప్లాన్ కూడా చేసింది. ఈ వేడుకలను అటు బీఆర్ఎస్‌గానీ, ఇటు కాంగ్రెస్‌గానీ.. నిర్వహించడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది కాషాయపార్టీ.

సెప్టెంబర్ 17పై బీజేపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌. సెప్టెంబర్‌ 17 విమోచనం కాదు..విలీనమే అన్నారు.

విమోచం, విలీనం ఇలా రకరకాల పేర్లతో సెప్టెంబర్‌ 17 పొలిటిక్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా మారుతుంటుంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..