Flash News: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్.. మరో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల.!

|

Jun 15, 2021 | 5:57 PM

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మరో వారం రోజుల్లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్..

Flash News: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్.. మరో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల.!
Follow us on

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మరో వారం రోజుల్లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆన్‌లైన్ క్లాసులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే ఫస్టియర్ ప్రవేశాలు ముగిసిన తర్వాత మొదటి సంవత్సరం విద్యార్ధులకు జూలై మధ్యవారం నుంచి క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగామ్ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కళాశాలలు విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమర్ జలీల్ హెచ్చరించారు.

గతేడాదిలాగే ఈసారి 70 శాతం సిలబస్ ఆధారంగా..

గత సంవత్సరం మాదిరిగానే 2021-22 విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్ధుల కోసం కళాశాలల్లోనే డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 200 ప్రైవేట్ కళాశాలలకు అనుమతి ఇచ్చారట.

Also Read: ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!