Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ ఘటనపై స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ.. ఏమన్నారంటే.. వీడియో

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే.. గన్‌మెన్ పట్ల మహమ్మద్ అలీ తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలీ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు.

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే.. గన్‌మెన్ పట్ల మహమ్మద్ అలీ తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలీ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. రేయి పగలు తన్ను కంటికి రెప్పలా భద్రత కలిగిస్తున్న ఆ గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడని.. అందరూ తన బిడ్డలేనని.. అనుకోకుండా జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరికైనా, ఎంత చిన్నవారికైనా గౌరవం ఇస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మలక్‌పేట మహబూబ్‌ మెడిసిన్ గంజ్‌లోని మార్కెట్‌ యార్డులో రూ. 53 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిన్న గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దని ప్రేమతోనే వ్యవహారించానంటూ పేర్కొన్నారు. కొట్టాలనే ఉద్దేశం ఏ కోశాన లేదన్నారు. అందరినీ తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటానని తెలిపారు. తనతో ఉన్నవారందరూ తన బిడ్డలేనని.. వారిని అలా చూసుకుంటానని వివరణ ఇచ్చారు.

కాగా.. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​పుట్టినరోజు సందర్భంగా.. హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూల బొకే విషయంలో మహమూద్​అలీ.. తన గన్​మెన్​పై చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మహమ్మద్ అలీపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ.. తన భద్రత సిబ్బందిపై వివరించిన తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. హోంమంత్రి అలా చేయడం తగదంటూ దేశవ్యాప్తంగా మహమ్మద్ అలీ తీరును తప్పుబట్టారు. ఈ తరుణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ ఈ విధంగా స్పందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..