Telangana High Court: ఏం చేస్తారు ? ఇప్పటి వరకు ఏం చేశారు ? ఇకపై ఏం చేయబోతున్నారు ? హైకోర్టు వరుస ప్రశ్నలు

ఏం చేస్తారు ? ఇప్పటి వరకు ఏం చేశారు ? ఇకపై ఏం చేయబోతున్నారు ? ఆంక్షలు విధించడం కాదు.. వాటి అమలు చేసేందుకు ఎలాంటి

Telangana High Court: ఏం చేస్తారు ? ఇప్పటి వరకు ఏం చేశారు ? ఇకపై ఏం చేయబోతున్నారు ? హైకోర్టు వరుస ప్రశ్నలు

Updated on: Sep 07, 2021 | 8:36 PM

Vinayaka Chaviti – Ganesh Festival – Telangana High Court ఏం చేస్తారు ? ఇప్పటి వరకు ఏం చేశారు ? ఇకపై ఏం చేయబోతున్నారు ? ఆంక్షలు విధించడం కాదు.. వాటి అమలు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చేశారో చెప్పాల్సిన బాధ్యత లేదా ? అంటూ సీపీ, జీహెచ్‌ఎంసీకి చివాట్లు పెట్టింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులో ఈసారి కరోనా ఎఫెక్ట్ కూడా తోడవటంతో పోలీసులు.. పలు ఆంక్షలు విధించారు. GHMC పరిధిలో 48 చెరువుల దగ్గర నిమజ్జనం ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం.

వినాయక నిమజ్జనం ఆంక్షలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జరిగిన విచారణలో కేవలం10 నిమిషాల ముందు సీపీ నివేదిక ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది న్యాయస్థానం. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా అని మండిపడింది. అలాగే జీహెచ్‌ఎంసీ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఆంక్షల నేపధ్యంలో నిమజ్జనంలో తలెత్తే సమస్యలపై పోలీసు, జీహెచ్‌ఎంసీకి ఏమాత్రం శ్రద్ధ లేదంది తెలంగాణ హైకోర్టు.

హైదరాబాద్‌లో నలు మూలల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలివస్తాయి. వాటిని చూసేందుకు వచ్చే జనం గూమి కూడకుండా ఏలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. రంగు విగ్రహాల నిమజ్జనం కోసం పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్‌ సూచించిన మార్గదర్శకాల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడింది.

అధికారులు సలహాలు కాదు చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని లాయర్ వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

Read also: AP BJP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ‘ధర్నా’ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ