Telangana High Court: ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి..  ఇళ్ల మధ్య పబ్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు..

|

Dec 29, 2021 | 9:50 PM

ఇళ్ల మధ్య పబ్‌లపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్నలు కురిపించింది. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌ల నిర్వహణపై హైకోర్టులో విచారణ చేసింది. ఇళ్ల..

Telangana High Court: ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి..  ఇళ్ల మధ్య పబ్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు..
High Court
Follow us on

Telangana High Court: ఇళ్ల మధ్య పబ్‌లపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్నలు కురిపించింది. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌ల నిర్వహణపై హైకోర్టులో విచారణ చేసింది. ఇళ్ల మధ్యలో పబ్‌లు ఏర్పాటు కారణంగా ట్రాఫిక్, నాయిస్ పొల్యూషన్ ఎక్కువైందంటూ హైకోర్టుకు పిటిషనర్లు కోరారు. విచారణలో భాగంగా పబ్చులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇళ్ల మధ్యలో పబ్‌ల దగ్గర ట్రాఫిక్, నాయిస్ పొల్యూషన్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పబ్బుల నుంచి బయటికి రాగానే ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం లేదని ప్రశ్నించింది.

పబ్‌ల వద్ద న్యుసెన్స్‌ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలని.. శబ్ద కాల్యుషం.. ట్రాఫిక్ మానేజ్మెంట్‌పై యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. యాక్షన్ ప్లాన్ వివరాలు ఇచ్చేందుకు అడిషనల్ ఏజీ సమయం కోరారు. సమయం ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.

గురువారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. చర్యలు చెప్పడానికి అడిషనల్ ఏజీ సమయం కోరారు. నూతన సంవత్సర వేడుకలకు ముందే వివరాలు చెప్పాలని హైకోర్టు వాఖ్యానింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్