ఖైరతాబాద్ గణేషుడికి తెలుగు రాష్ట్రాల్లో కాక దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు.. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటూంటారు. ఈసారి ఖైరతాబాద్ గణేషుడు భారీ ఆకారంతో.. ‘ద్వాదశ మహా వినాయకుడి’గా దర్శనమిస్తున్నాడు.
గత 60 ఏళ్లకు పైగా.. పూజలందుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో ఏర్పాటు చేసిని ‘ద్వాదశ మహా వినాయకుడి’కి గవర్నర్ దంపతులు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో.. గణేష్ కమిటీ సభ్యులతో పాటు.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. అలాగే.. హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత, ఎంపీ దత్తాత్రేయ కూడా ఖైరతాబాద్ గణేషుని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. పూజారులు దత్తాత్రేయకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.
కాగా.. ఖైరతాబాద్ వినాయకుడికి.. హైదరాబాద్ పోలీసులు భారీగా.. భద్రత నిర్వహించారు. దాదాపు 48 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో.. నిఘా ఏర్పాటు చేశారు. వినాయకుని భారీ విగ్రహాన్ని దర్శించుకుంనేందుకు పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు అలాగే.. భక్తులు వస్తోన్న నేపథ్యంలో.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా.. గణేష్ కమిటీ కూడా పలు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.