సెప్టెంబర్ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. గ్రౌండ్‌లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని సూచించారు గవర్నర్. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని అన్నారు. నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమని ఆమె చెప్పారు.
నిజాం పాలనలో పరకాలలో 35 మందిని కాల్చి చంపిన ఘటనను గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయన్నారు. ఈ తరహ ఘటనలను ఎలా మర్చిపోతామని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనల్లో చనిపోయినవారు మన సోదరులు, సోదరీమణలని ఆమె చెప్పారు. అమరుల రక్తం తెలంగాణపై చిందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
బైరాన్ పల్లిలో 90 మందిని చంపిన ఉదంతాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత చరిత్రను దాచిపెట్టలేమన్నారు. ఈ తరం యువత ఆనాడు చోటు చేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకారు మూకలు ఈ దాడులు చేశారని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. గతంలో హైద్రాబాద్ రాష్ట్రంలో కర్ణాటక, మహరాష్ట్రలోని పలు ప్రాంతాలు ఉండేవన్నారు.
Live: Hon’ble Governor of Telangana Smt @DrTamilisaiGuv inaugurates The Hyderabad Liberation Movement – Photo & Art Exhibition at Parade Grounds, Secunderabad. https://t.co/exJRZZ0YJE
— G Kishan Reddy (@kishanreddybjp) September 14, 2022
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానం పంపింది కేంద్రం. హైద్రాబాద్ వేదికగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. నిజాం పాలన ఉండి ఈ ప్రాంతాలు కూడ ఆనాడు విముక్తి పొందినందున ఈ రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం