24/7 పని పట్ల కమిట్‌మెంట్‌తో ఉంటూ శ్రద్దగా పని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి హాలిడే వచ్చిందంటే కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇంకేముంది ఈ హాలిడేస్‌తో పాటు వీకెండ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని.. లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఊహించని విధంగా ఆ హాలిడేలు వీకెండ్స్‌లోనే వస్తే మాత్రం బాగా నీరసించిపోతాం. ఇక వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ చూస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2020కు సంబంధించి సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది.
అందులో మాములు సెలవులు తప్పితే.. దాదాపు 9 పండుగలు శనివారం, ఆదివారాల్లోనే రావడం గమనార్హం. ఐటీ ఉద్యోగుల నుంచి పలు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వాళ్లందరికీ కూడా శని, ఆదివారాలే సెలవు దినాలు.. ఇక ఆ రోజుల్లోనే పండగలు కూడా వచ్చేయడంతో జోష్ అనేది లేకుండా పోయింది. కాగా, సెలవుల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.. సాధారణ సెలవులు 27 కాగా.. ఐచ్ఛిక సెలవులు 17 ఉన్నాయి.