తెలంగాణ ప్రభుత్వం(Telangana government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం రూ. 5లకే నాణ్యమైన చక్కటి భోజనం అందించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Ministr Harish Rao) వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య అధికారులు, హరే కృష్ణ మూవ్‌మెంట్ (హెచ్‌కెఎం) మధ్య ఎంఓయు కుదిరింది. రోగి సహాయకులకు ఐదురూపాయలకే శుధ్దమైన ఙోజనం మూడు పూటలా అందించనుంది. జీహెచ్ఎంసీ లో 5 రూపాయలకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటికే పేదలకు ఎలా భోజన సౌకర్యం అందిస్తున్నారో.. అదేరీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఈ సౌకర్యం ఇప్పటి నుండి కలగనుంది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులతో పాటు వారి బంధువులకు, ప్రత్యేకించి దీర్ఘకాలం పాటు దీర్ఘకాలిక రోగులతో పాటు వచ్చే వారికి రూ.5కే పరిశుభ్రమైన భోజనం అందించనున్నారు.
ఇందులో భాగంగా.. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబర్ రైస్ తోపాటు పచ్చడి బ్రేక్ ఫాస్ట్‌గా అందిస్తారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌గా అన్నం, సాంబర్ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి వడ్డిస్తారు. డిస్పోజబుల్ ప్లెట్, వాటర్ గ్లాస్ సైతం అందించబడుతుంది.
దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. రోగులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తుంది.కాని రోగుల సహాయకులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించే ప్రభుత్వం రోగి సహాయకులకు సబ్సిడీ భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి సంవత్సరం, పేషెంట్ అటెండర్లకు భోజనానికి రూ.5 పథకంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 20,000 మంది రోగులకు ఆహారం అందించేందుకు రూ.38.66 కోట్లు ఖర్చుచేయనుంది.
ఈ కార్యకమ్రంలో హరె కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కాంతేయ దాస ప్రభు, ధనుంజయ దాస ప్రభు, టీఎస్ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నరు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎం,ఎన్. జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, కోటి ఈఎన్.టీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోటి మెటర్నటీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోటి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట ఎం.ఎన్ ఏరియా ఆస్పత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కోండాపూర్ ఏరియా ఆస్పత్రి, నాపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఐదు రూపాయల భోజన సౌకర్యం కల్పించనున్నాం.
ఇవి కూడా చదవండి: JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి
భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు