ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఫీజులివే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్..

|

Jun 23, 2021 | 1:11 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 401ని తాజాగా..

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఫీజులివే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్..
Private Hospitals
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 401ని తాజాగా వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, కరోనా పరీక్షలకు రోజుకు రూ. 4 వేలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఐసీయూ గదిలో రోజుకు రూ. 7,500గా నిర్ణయించింది. ఇక వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు రూ. 9 వేలు వసూలు చేయాలని సూచించింది. కాగా, కరోనా టెస్టులకు సంబంధించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి..

  • పీపీఈ కిట్ – రూ. 273
  • హెచ్ఆర్‌ సీటీ- రూ. 1995
  • డిజిటల్ ఎక్స్‌రే- రూ. 1300
  • ఐఎల్6- రూ. 1300
  • డీడైమర్- రూ. 300
  • సీఆర్‌పీ- రూ. 500
  • ప్రొకాల్ సీతోసిన్- రూ. 1400
  • ఫెరిటీన్- రూ. 400
  • ఎల్‌డీహెచ్- రూ. 140

ఇదిలా ఉంటే సాధారణ అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ. 75గా.. కనీస ఛార్జీ రూ. 2 వేలు మించరాదు. అటు వసతులతో కూడిన అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ.125, మినిమం ఛార్జ్ రూ. 3 వేలుగా నిర్ణయించింది.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!