Telangana: ముంబై నార్కో Vs తెలంగాణ ఈగల్‌.. వాగ్దేవి డ్రగ్స్‌లో గమ్మతు నిజాలు

లీజుకు తీసుకున్నాడు. ప్రొడక్ట్‌ మార్చేశాడు. మేడ్చల్‌ జిల్లా చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్‌లో మెఫిడ్రిన్‌ డ్రగ్‌ తయారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టుబడ్డ రసాయనాలతో వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ తయారు చేయొచ్చని అంటున్నారు ఆపరేషన్‌ నిర్వహించిన మహారాష్ట్ర పోలీసులు.

Telangana: ముంబై నార్కో Vs తెలంగాణ ఈగల్‌.. వాగ్దేవి డ్రగ్స్‌లో గమ్మతు నిజాలు
Hyderabad News

Updated on: Sep 09, 2025 | 9:46 PM

ఓ వైపు ప్రభుత్వాలు మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నా.. సీక్రెట్‌గా వాటిని తయారుచేసి తరలించేవారు తరలిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో పెద్ద డ్రగ్ డెన్ బయపడింది. ఇందులో వందల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు దొరికాయి. కెమికల్ ఫ్యా్క్టరీ పేరుతో ఈ దందా నడుస్తోంది. చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో పోలీసులు సోదాలు చేశారు. 5.79 కిలోల ఎండి(మెఫెడ్రోన్), 35,500 లీటర్ల రసాయన ద్రావణాలు, 950 కిలోల పౌడర్, మాదకద్రవ్యాల తయారీ పరికరాలు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేశారు. చిన్న లింక్ ఆధారంగా డ్రగ్ రాకెట్‌ను థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు పట్టుకున్నారు. ఆగస్టు 8, 2025న కాశీమిరా బస్ స్టాప్ సమీపంలోని మీరా రోడ్ పూర్వాలో నివసించే ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా (23) అనే బంగ్లాదేశ్ జాతీయురాలిని 105 గ్రాముల మెఫెడ్రోన్‌ డ్రగ్‌తో అధికారులు పట్టుకున్నారు. కాశీగావ్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం, 1985 మరియు ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం, 2025 కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్ హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసినట్టుగా ఫాతిమా పోలీసులకు తెలిపింది. పూణేలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న మరికొందరిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని చర్లపల్లిలో డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్టుగా తెలుసుకుని ఆపరేషన్ చేపట్టారు. వాగ్దేవి ల్యాబ్‌లో డ్రగ్స్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి